• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

కె చంద్రశేఖర్ రావు ప్రొఫైల్

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మెదక్ జిల్లా సిద్ధిపేట నుండి 4 సార్లు ఎంఎల్ఎగా(1985-2003) ఎన్నికై డిప్యూటీ స్పీకర్ మరియు మంత్రిగా పని చేసి ఉన్నారు. వారు 2004 నుండి 2009 వరకు మహబూబ్ నగర్ లోక్ సభకు ఎన్నికైనారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక మరియు ఉపాది మంత్రిగా పని చేసినారు.వారు 2001 లో స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యెక తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణా రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు. తెలుగు మరియు ఉర్దూ భాషల్లో మంచి నైపుణ్యం కలిగిన వారు 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు వలన జరిగిన నష్టాన్ని ప్రజలందరికి వివరించారు.వారు మొక్కవోని దీక్షాదక్షతలు మరియు సమయస్పూర్తితో విమర్శకుల ప్రశంశలు పొందారు. 2014 సాధారణ ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపి జూన్2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు. 1954లో మెదక్ జిల్లా చింతమడక గ్రామంలో పుట్టిన చంద్రశేఖర్ రావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఎ(లిటరేచర్) చేసారు. శ్రీమతి శోభ గారితో పెళ్ళైన వారికి ఒక కుమారుడు కుమార్తె కలరు.